మీ అధికారానికి మించి అనుమతులెలా ఇచ్చారు?
చిదంబరాన్ని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో నాటి ఆర్థిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ ప్రశ్నించింది. రూ.3,500 కోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని 2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించింది. అయితే ఆర్థిక మంత్రికి రూ.600 కోట్లలోపు ఒప్పందాలకు అనుమతిచ్చే అధికారమే ఉందని, ఈ డీల్ అంతకుమించినదైనప్పటికీ ఎలా అనుమతిచ్చారన్న అంశంపై ఆయన్ను ఇటీవల సీబీఐ పలు వివరాలు అడిగింది. రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి.