ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్‌తో డీల్ రద్దై పోయింది. ఇంక చేసేదేమీ లేక, మెల్లమెల్లగా ఎయిర్‌సెల్ తన భారత ఆపరేషన్ల నుంచి వైదొలగాలని చూస్తోంది. ఫండ్స్ లోటు, ఎక్కువ రుణాల నేపథ్యంలో ఎయిర్‌సెల్ తన ఆపరేషన్లను మూసి వేయాలని చూస్తోంది. రిలయన్స్ కమ్యూనికేషన్‌తో విలీన డీల్ రద్దు అయిన తర్వాత ఎయిర్‌సెల్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తాను కలిగి ఉన్న స్పెక్ట్రమ్‌ను మినహాయించి ఎయిర్‌సెల్ ఓ ఒప్పందాన్ని రూపొందించుకోవాలని చూస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్‌లో కంపెనీ తన వైర్‌లెస్ ఆస్తులను విక్రయించేయాలని చూస్తున్నట్టు తెలిసింది. అంతేకాక 89 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కూడా దేశీయ అతిపెద్ద టెలికాం ప్లేయర్‌కు తరలించనుందట. తన 40వేల టవర్లను ఓ ప్రత్యేక సంస్థకు విక్రయించేయాలని చూస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు.
ప్రస్తుతం కంపెనీ రుణం రూ.20వేల కోట్లు ఉంది. ఈ రుణాన్ని తగ్గించుకోవడం కోసం ఎయిర్‌సెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీకి కేవలం 2జీ, 3జీ స్పెక్ట్రమ్‌లు మాత్రమే ఉన్నాయి. 4జీ స్పెక్ట్రమ్‌ను లేదు. 17 సర్కిళ్లలో ఎయిర్‌సెల్ తన కార్యకలాపాలు సాగిస్తుండగా.. దానిలో 13 సర్కిళ్లు 3జీకి సంబంధించినవి. కంపెనీ ఎక్కువ రెవెన్యూలను తమిళనాడు నుంచి ఆర్జిస్తోంది. అంతకముందు ఎయిర్‌సెల్ తన 2జీ, 3జీ స్పెక్ట్రమ్‌ను విక్రయించాలని చూడగా.. వాటిని విక్రయించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment