రూ.104 ప్యాక్‌ : వన్‌ ఇయర్‌ వ్యాలిడిటీ | Aircel Offers a Year's Worth of 20 Paise Per Minute Voice Calls With Rs. 104 Pack  | Sakshi
Sakshi News home page

రూ.104 ప్యాక్‌ : వన్‌ ఇయర్‌ వ్యాలిడిటీ

Published Mon, Nov 20 2017 5:10 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

Aircel Offers a Year's Worth of 20 Paise Per Minute Voice Calls With Rs. 104 Pack  - Sakshi

టెలికాం దిగ్గజాలకు షాకిస్తూ ఎయిర్‌సెల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏడాది కాలం పాటు వ్యాలిడిటీతో కొత్త వాయిస్‌ టారిఫ్‌ రూ.104ను ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్‌ కింద కాల్‌ రేట్లను నిమిషానికి 20 పైసలకి తగ్గించింది. ఈ తగ్గించిన రేట్లు ఎస్టీడీ, లోకల్‌ కాల్స్‌ అన్నింటికీ వర్తించనున్నట్టు పేర్కొంది. అమెజాన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని అపరిమిత కాలింగ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన అనంతరం ఈ కొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్‌ కేవలం ఢిల్లీ సర్కిల్‌లోని ఎయిర్‌సెల్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. నిమిషానికి 20 పైసల టారిఫ్‌ను లాంచ్‌ చేయడంతో, కేవలం పాత కస్టమర్లతో తమ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా.. కొత్త టెలికాం యూజర్లు ఎయిర్‌సెల్‌ను ఎంపిక చేసుకునేలా చేయనున్నామని కంపెనీ నార్త్‌ రీజనల్‌ హెడ్‌ హరీష్‌ శర్మ చెప్పారు. 


అంతకముందు కూడా ఎయిర్‌సెల్‌ రూ.88తో వీక్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. దీని కింద రోజుకు 1జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. 28 రోజుల కోసం రూ.199 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఎయిర్‌సెల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. టెలికాం దిగ్గజాల దెబ్బకు నష్టాల పాలైన ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌తో విలీనమవ్వాలని అనుకుంది. కానీ ఇటీవలే ఈ రెండు కంపెనీల విలీన చర్చలు సఫలమయ్యాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement