సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో
సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో
Published Thu, Sep 14 2017 6:23 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ చిదంబరం నిరాకరించారు. 2006లో కార్తీ తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఓ విదేశీ పెట్టుబడి క్లియరెన్స్‌కు సంబంధించి ప్రశ్నించేందుకు హాజరుకావాలని ఆయనను సీబీఐ కోరింది. ఈ అంశంలో నిందితులపై ఆరోపణలను ప్రత్యేక కోర్టు తిరస్కరించిందని చెబుతూ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నిరాకరించారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ సమాచారాన్ని సీబీఐకి చేరవేశామని ఆయన న్యాయవాది అరుణ్ నటరాజన్ చెప్పారు.
మరోవైపు రాజకీయ కోణంలోనే తమ కుమారుడిని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆరోపిస్తున్నారు. ఎఫ్‌ఐపీబీ అనుమతులు రొటీన్‌గా ఇచ్చేవేనని చెప్పారు.
Advertisement
Advertisement