చిదంబరం నిర్ణయం తప్పు | Probing chidambaram's role in Aircel-Maxis deal: CBI to court | Sakshi
Sakshi News home page

చిదంబరం నిర్ణయం తప్పు

Published Tue, Sep 23 2014 7:48 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

చిదంబరం నిర్ణయం తప్పు - Sakshi

చిదంబరం నిర్ణయం తప్పు

ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కోర్టుకు తెలిపిన సీబీఐ
 న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో వూజీ ఆర్థికమంత్రి చిదంబరం రూ.3,500 కోట్ల ఒప్పందానికి అనువుతించడం తప్పని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక 2జీ కోర్టుకు సీబీఐ తెలిపింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకబోర్డు (ఎఫ్‌ఐపీబీ) ద్వారా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపే అధికారం చిదంబరానికి లేదని, ఆర్థిక వుంత్రిగా ఆయునకు కేవలం రూ. 600 కోట్ల ఒప్పందాలకు వూత్రమే అనువుతించే అధికారం ఉంటుందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ప్రత్యేక కోర్టుకు వివరించారు. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థికవుంత్రిగా ఉండగా ఎరుుర్‌సెల్-వూక్సిస్ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ అనువుతించింది. రూ. 600 కోట్లకు పైబడిన ఒప్పందాలకు ఆమోదం తెలిపే అధికారం ఆర్థికవ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ కమిటీ (సీసీఈఏ) కే ఉంటుందని ఆ అధికారి కోర్టుకు తెలిపారు.
 
 చిదంబరం వూక్సిస్ ఒప్పందాన్ని ఈ కమిటీ ఆమోదానికి పంపి ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ న్యాయువాది తెలిపారు. ఎరుుర్‌సెల్-వూక్సిస్ కేసులో సీబీఐ టెలికంశాఖ వూజీ వుంత్రి దయూనిధి వూరన్, ఆయున సోదరుడు కళానిధి వూరన్, సన్ డెరైక్ట్ టీవీ, వూక్సిస్ కవుూ్యనికేషన్, సౌత్ ఆసియూ ఎంటర్‌టైన్‌మెంట్ హోల్డింగ్, ఆస్ట్రాల్ ఆసియూ నెట్‌వర్క్ సంస్థలతోపాటు వురికొందరిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 13వ తేదీకి వారుుదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement