
సాక్షి, ముంబై: రూ. 3,500 కోట్ల ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. అంతేకాదు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన్ను ఎ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. చిదంబరంతోపాటు, ఆయర కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్ భాస‍్కరన్ (కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్) వి. శ్రీనివాసన్ (ఎయిర్సెల్ మాజీ సీఈఓ), నాలుగు మాక్సిస్ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఈ కేసు ఢిల్లీ కోర్టు విచారణకు రానుంది. నవంబర్ 26న ఈ చార్జిషీటును విచారణకు స్వీకరించనున్నట్లు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ చెప్పారు.
అయితే ఈ కేసులోనవంబరు 29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార‍్తీని అరెస్ట్ చేయకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అక్టోబర్ 25 వరకే ఉన్నా.. ఇవాళ మరోసారి దానిని పొడిగించింది. సీబీఐ, ఈడీ తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment