కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరంను మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి జూన్ 12న చిదంబరం వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు మరోసారి విచారణకు హాజరవ్వాలని ఈడీ సమన్లు జారీ చేసింది. 3,500 కోట్ల రూపాయల ఎయిర్‌సెల్ –మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంను ఈడీ విచారించింది. ఎయిర్‌సెల్- మ్యాక్సిస్‌కు సంబంధించి అంతభారీ మొత్తంలో ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై.. అప్పటి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్‌ఐపీబీ) అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఈడీ ఆయనను ప్రశ్నించింది.
జూలై 10 వరకు అరెస్టు చేయొద్దు
ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో చిదంబరానికి ఊరట లభించింది. జూలై 10 వరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment