ఎయిర్‌సెల్‌ ఆఫర్‌: వారికి ఫ్రీ డేటా | Aircel Offers 1GB Free Data If You Pay Bill From Its App | Sakshi
Sakshi News home page

ఎయిర్‌సెల్‌ ఆఫర్‌: వారికి ఫ్రీ డేటా

Published Fri, Sep 8 2017 7:09 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ఎయిర్‌సెల్‌ ఆఫర్‌: వారికి ఫ్రీ డేటా - Sakshi

ఎయిర్‌సెల్‌ ఆఫర్‌: వారికి ఫ్రీ డేటా

సాక్షి, ‍న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌సెల్‌ తన పోస్టు పెయిడ్‌ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎయిర్‌సెల్‌ యాప్‌ వాడుతూ యూజర్లు బిల్లును చెల్లిస్తే, 1జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. '' మీ బిల్లును ఎయిర్‌సెల్‌ యాప్‌పై ఆన్‌లైన్‌లో చెల్లించండి.. 1జీబీ డేటాను ఉచితంగా పొందండి'' అని ఎయిర్‌సెల్‌ తన ప్రకటనలో తెలిపింది. 
 
బిల్లు చెల్లింపులకు, అకౌంట్‌ను నిర్వహించడానికి వంటి పలు వాటికి ఎయిర్‌సెల్‌ యాప్‌ను వాడుకోవచ్చని చెప్పింది. ఇటీవలే భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా 200 రూపాయల బిల్లు చెల్లిస్తే, 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఎయిర్‌సెల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌తో ఎయిర్‌సెల్‌ విలీనం కాబోతుంది. దీనికి సంబంధించి గతనెలలో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ నుంచి ఆమోదం కూడా లభించింది. రిలయన్స్‌ జియో రాకతో, టెలికాం కంపెనీలన్నీ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. తన కస్టమర్లను కాపాడుకోవడానికి సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి.  
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement