తలైవా రజనీకాంత్ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఏడు పదుల వయసులోనూ అభిమానులను అలరించేందుకు సినిమాలు చేస్తున్నాడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ, హీరోయిన్ తమన్నా ముఖ్యపాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. ఆగస్టు 10న రిలీజవుతున్న ఈ సినిమా రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సినిమా పాటలు, ట్రైలర్ కూడా బాగానే క్లిక్కయింది.
బడ్జెట్‌లో సగం సూపర్‌స్టార్‌కే
తాజాగా ఈ సినిమాలో నటీనటుల పారితోషికం ఎంతనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జైలర్ సినిమాకు గానూ రజనీకాంత్ ఏకంగా రూ.100- 110 కోట్లు తీసుకున్నాడట! అంటే సినిమా బడ్జెట్‌లో దాదాపు సగం ఆయన పారితోషికానికే ఖర్చయినట్లు తెలుస్తోంది. సినిమాలో దాదాపు 15 నిమిషాల నిడివి మాత్రమే ఉన్న మోహన్‌లాల్ అందుకోసం రూ.8 కోట్లు తీసుకున్నాడట! ఇతర నటులు జాకీ ష్రాఫ్ రూ.4 కోట్లు, శివరాజ్ కుమార్ రూ.4 కోట్లు తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. అలాగే హీరోయిన్ తమన్నా రూ.3 కోట్లు, రమ్యకృష్ణ రూ.80 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
నెక్స్ట్ మూవీ ఆయన డైరెక్షన్‌లోనే
ఇకపోతే రజనీకాంత్ తన తర్వాతి చిత్రం 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఉండనున్నట్లు ఎప్పటినుంచో ఓ పుకారు షికారు చేస్తోంది. ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నట్లు రూమర్స్ గుప్పుమంటున్నాయి. అధికారిక ప్రకటన వస్తేకానీ ఇది నిజమా? కాదా? అనేది స్పష్టత రానుంది.
చదవండి: లలిత్ మోదీతో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన సుష్మిత సేన్
Comments
Please login to add a commentAdd a comment