సూపర్‌స్టార్ 'జైలర్' రచ్చ మాములుగా లేదు. ఐదు రోజులు అవుతున్నా హీరో రజినీకాంత్ హవా తగ్గట్లేదు. అయితే ఈ సినిమాలో రజినీ కోడలి పాత్రలో ఓ బ్యూటీ నటించింది. బయట హాట్‌నెస్‌తో రెచ్చిపోయే ఆమెని.. స్క్రీన్‌పై పద్ధతిగా చూపించారు. గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు. ఆమె తెలుగు సినిమాల్లో ఇప్పటికీ హీరోయిన్‌గా చేసిందని మీలో ఎవరికైనా తెలుసా? ఇంతకీ ఆ నటి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఆమె డీటైల్స్
'జైలర్'లో రజినీకాంత్ కోడలిగా కొన్ని సీన్స్‌కి పరిమితమైన ఈ భామ పేరు అదితి. అయితే సినిమాల్లోకి వచ్చాక మిర్నా మేనన్‌గా పేరు మార్చుకుంది. కేరళలోని ఇడుక్కిలో పుట్టిన ఈమె.. నటి కాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. కొన్నాళ్లకు ఈమె ఫొటోలని చూసిన ఓ డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అలా 2016లో 'పట్టదారి' మూవీలో నటించింది. 2018లో 'కలవని మప్పిలై' అనే మరో చిత్రం చేసింది.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!)
మోహన్‌లాల్‌తో
తమిళంలో తొలి రెండు సినిమాలు చేసిన మిర్నా.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ 'బిగ్ బ్రదర్'లో నటించింది. దీంతో ఈమెకు కాస్త గుర్తింపు దక్కింది. అలా తెలుగులో ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో', అల్లరి నరేశ్ 'ఉగ్రం'లో హీరోయిన్‍గా చేసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆడనప్పటికీ.. ఈమె యాక్టింగ్‌కి మాత్రం బాగానే పేరొచ్చింది.
'జైలర్'కి కోడలిగా
అయితే ఇప్పటివరకు పలు చిన్న సినిమాల్లో నటించిన మిర్నా.. రజినీకాంత్ 'జైలర్'లో నటించి దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ సినిమాలో పద్ధతిగా కనిపించింది కానీ సోషల్ మీడియాలో గ్లామర్ చూపించడంలో అస్సలు మొహమాటం చూపించట్లేదు. అయితే డైరెక్టర్స్ ఈమెలోని హాట్‌నెస్ యాంగిల్‌ని తొక్కేస్తున్నారని పలువురు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరో మలయాళ బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల క్రష్ లిస్టులోకి చేరిందనిపిస్తుంది.
(ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు)
Comments
Please login to add a commentAdd a comment