జైలర్‌ నటుడికి రజనీకాంత్‌ మర్చిపోలేని గిఫ్ట్‌! | Jailer Actor Jaffer Sadiq Gets Special Gift From Rajinikanth - Sakshi
Sakshi News home page

Rajinikanth: జైలర్‌ నటుడికి రజనీకాంత్‌ మర్చిపోలేని గిఫ్ట్‌.. ఎగిరి గంతేస్తున్న నటుడు

Published Wed, Aug 23 2023 4:14 PM | Last Updated on Wed, Aug 23 2023 4:36 PM

Jailer Movie: Jaffer Sadiq Gets Great Gift From Rajinikanth - Sakshi

ఎంతైనా సూపర్‌స్టార్‌ రేంజే వేరు.. స్లోమోషన్‌లో నడుచుకుంటూ వస్తే చాలు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు ఆయనకు దాసోహమయ్యాయి. గతంలో రోబో 2 సినిమాతో ఈ రేంజ్‌ వసూళ్లు రాబట్టిన రజనీకాంత్‌ ఇన్నాళ్ల తర్వాత జైలర్‌ సినిమాతో మరోసారి ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ మీద వసూళ్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌ అంతా జైలర్‌ మేనియాలో ఉన్నారు.

ఈ సినిమాలో రజనీ వాడిన ఆయుధం ఏదైనా ఉందా? అంటే అది కళ్లజోడే! స్టైలిష్‌ లుక్‌ కోసం రజనీ సన్‌గ్లాసెస్‌ వాడాడు. ఏదైనా అరాచకం చేసేముందు రజనీ తన గాగుల్స్‌ను పెట్టుకుంటూ చిన్నపాటి నవ్వు విసురుతాడు. ఈ గాగుల్స్‌ను రజనీ ఒకరికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంతకీ అంతటి అమూల్యమైన బహుమతి అందుకుంది మరెవరో కాదు, జైలర్‌ నటుడు జాఫర్‌ సాదిఖ్‌. ఇతడు జైలర్‌లో రజనీకి అనుచరుడిగా నటించాడు. ఆ సమయంలోనే ఆ సన్‌గ్లాసెస్‌ తనకు ఇవ్వాలని సూపర్‌స్టార్‌ను అభ్యర్థించాడు. 

అతడి కోరిక మేరకు రజనీ తన కళ్లజోడును జాఫర్‌కు ఇచ్చేశాడు. ఈ విషయాన్ని అతడు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'ఇది నాకిచ్చిన సూపర్‌స్టార్‌కు కృతజ్ఞతలు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇంతటి అమూల్యమైన వస్తువు సాధించావంటే గ్రేట్‌, అది మాకు దక్కితే ఎంత బాగుండేదో అంటూ నెటిజన్లు కామెంట్లు  చేస్తున్నారు.

చదవండి: వనిత కూతుర్ని చూశారా? 18 ఏళ్లకే హీరోయిన్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement