Rajinikanth Jailer Movie Dancer Ramesh Passes Away - Sakshi
Sakshi News home page

జైలర్‌లో డ్యాన్స్‌ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్‌ అవ్వడానికి ముందే గదిలో శవమై..

Published Fri, Aug 18 2023 12:19 PM | Last Updated on Fri, Aug 18 2023 12:57 PM

Jailer Dancer Ramesh No More - Sakshi

వరుసగా ఫ్లాపులతో సతమతమైన కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌తో తన రేంజ్‌ ఏంటో చూపించాడు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను నేలమట్టం చేస్తూ కలెక్షన్స్‌తో విజృంభించాడు. ఆగస్టు 10న రిలీజైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్‌లో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలో ఐదు వందల కోట్ల మార్క్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

జైలర్‌ డ్యాన్సర్‌ ఎవరో తెలుసా?
ఇందులో నటించిన ఆర్టిస్టులందరికీ జైలర్‌ మూవీ బోలెడంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో విలన్‌ చిల్‌ అయ్యేందుకు తన దగ్గర పనిచేసేవాళ్లను డ్యాన్స్‌ చేయమంటూ ఉంటాడు. అందులో ఒకరు అందరినీ నవ్వించేలా స్టెప్పులేస్తూ ఉంటాడు. ఈయన పర్ఫామెన్స్‌ చూసి నవ్వనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా తన నటనతో మెప్పించిన వ్యక్తి పేరు రమేశ్‌. ఈయన తమిళ నటుడు, డ్యాన్సర్‌. ఈయన టిక్‌టాక్‌లో మూన్‌ వాక్‌లు, డిఫరెంట్‌ డ్యాన్స్‌లతో ఫేమస్‌ అయ్యాడు. తునివు చిత్రంలోనూ ఈయన నటించినట్లు తెలుస్తోంది. తాజాగా జైలర్‌లో నటించడంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఈయన గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్‌, సోషల్‌ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు.

జైలర్‌కు ముందే మరణం
అయితే ఆయన మన మధ్య లేరు. జైలర్‌ విజయాన్ని చూడకముందే కన్నుమూశారు. జనవరి 27న తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. కోలీవుడ్‌ కథనాల ప్రకారం ఆయన తీవ్రమైన ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారట. ఈ క్రమంలోనే రమేశ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. రమేశ్‌ మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తను బతికి ఉండుంటే మరిన్ని అవకాశాలు వచ్చేవని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది: డిస్కో శాంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement