Rajinikanth Fans Beat up 2 Men for Giving Negative Review of Jailer Movie - Sakshi
Sakshi News home page

Jailer Movie: జైలర్‌పై నెగెటివ్‌ రివ్యూ.. కోపంతో చితకబాదిన అభిమానులు.. విజయ్‌ ఫ్యాన్సే కావాలని..

Published Thu, Aug 10 2023 9:02 PM | Last Updated on Thu, Aug 10 2023 9:36 PM

Rajinikanth Fans Beat up 2 Men for Giving Negative Review of Jailer In Chennai - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన జైలర్‌ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది. సినిమాలో రజనీ స్టైల్‌, యాక్షన్‌ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సెకండాఫ్‌ పర్వాలేదనిపించినా ఫస్టాఫ్‌ మాత్రం అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు. 

రజనీ సినిమా అంటే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాల్సిందే! థియేటర్‌లో పేపర్లు చిరగాల్సిందే, రచ్చ​ చేయాల్సిందే! ఇంత మంచి ఊపు మీదున్న అభిమానులను హర్ట్‌ చేశారు కొందరు యువకులు. సినిమా బాలేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇది రజనీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. తమ అభిమాన హీరో సినిమా బాలేదంటారా? అని కోపంతో ఊగిపోతూ వారిని చితకబాదారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే వాళ్లు దళపతి విజయ్‌ ఫ్యాన్స్‌ అని, కావాలనే తలైవా సినిమాపై వ్యతిరేకత తీసుకువచ్చేందుకు ఇలా కుట్రపన్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో మరోసారి రజనీకాంత్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ మధ్య వార్‌ మొదలైంది. జైలర్‌ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అనిరుధ్‌ సంగీతం అందించాడు.

చదవండి: జైలర్‌ సినిమా రివ్యూ

వరదలో మూడు కార్లు కొట్టుకుపోయాయి: సన్నీలియోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement