టైటిల్ చూడగానే మీరు కచ్చితంగా అవాక్కై ఉంటారు. ఎందుకంటే రజనీకాంత్ 'జైలర్' సినిమాతో.. ఆర్సీబీ జెర్సీకి ఏంటి సంబంధం అని తెగ ఆలోచిస్తున్నారేమో కదా! అంత ఇబ్బంది పడొద్దులేండి. ఏం జరిగిందో వివరిస్తాం. అలా చదివేస్తే అసలేం జరిగిందనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది.
(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)
ఏం జరిగింది?
సూపర్‌స్టార్ రజనీకాంత్ రీసెంట్ మూవీ 'జైలర్'. చాలారోజుల నుంచి హిట్ లేని రజనీకి ఇది కమ్ బ్యాక్ సినిమా అనొచ్చు. ఎందుకంటే సినిమా నార్మల్‌గా ఉన్నప్పటికీ.. పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో రజనీ.. తన మనవడిని చంపడానికొచ్చిన విలన్ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని చంపేస్తాడు. అప్పుడు అతడు ఆర్సీబీ జెర్సీతో కనిపిస్తాడు.
దిల్లీ హైకోర్ట్ తీర్పు
అయితే ఆ సీన్ లో బెంగళూరు జట్టు జెర్సీని తొలగించాలని దిల్లీ హైకోర్టు.. 'జైలర్' చిత్రబృందానికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1 నుంచి అన్ని థియేటర్లలోనూ ఇది అమలయ్యేలా చూడాలని తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ గానీ, వేరే వ్యక్తులు గానీ దీనిపై ఫిర్యాదు చేసినట్లు లేదు. కానీ స్వయంగా కోర్టు ఇలా ఆదేశాలు జారీ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!)
Comments
Please login to add a commentAdd a comment