సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్‌తో ప్రపంచం మొత్తం సినీ అభిమానులను తనపైపు తిప్పుకున్నారు. ఈరోజు తలైవా పేరు ఎక్కడ చూసిన మారుమ్రోగిపోతుంది. దాదాపు మూడేళ్ల తరువాత భారీ హిట్‌ను ఆయన అందుకున్నారు. గతంలో ఆయన నటించిన దర్బార్, అన్నాతే సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోవడం. ఆ తర్వాత తలైవా అనారోగ్యం పాలవడం జరిగాయి. దీంతో ఇక ఆయన సినిమాలకు దూరం కావడం మంచిదనే సలహాలు కూడా పలువురు ఇచ్చారు.
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!)
మరికొందరైతే ఏకంగా 72 ఏళ్ల వయస్సులో ఇంకేం సినిమాలు తీస్తాడు. ముందు ఆయనకు కథలు ఎంచుకోవడమే చేతకావడం లేదని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో డైరెక్టర్ నెల్సన్‌కు రజనీ అవకాశం ఇచ్చాడు. అప్పటికే విజయ్‌తో బీస్ట్ సినిమా తీసి ప్లాప్ మూటగట్టుకున్న డైరెక్టర్ నెల్సన్‌కు రజనీ అవకాశం ఇవ్వడంతో ఇక రజనీ పని అయిపోయినట్లే అంటూ కొందరు చెప్పుకొచ్చారు ఇలా రకరకాలుగా రజినీపై విమర్శలు వచ్చాయి.
తాజాగా ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా సినిమా విడుదలకు ముందే ఆయన ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. తాజాగా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మొదటిసారి ఆయన 'జైలర్' గురించి మాట్లాడారు. సినిమా షూటింగ్ ప్రారంభంలో చాలా ఒత్తిడి ఉండేదని ఇలా చెప్పారు. 'భారీ అంచనాల మధ్య 'జైలర్' విడుదలైంది. ఒక సందర్భంలో నేను కూడా సినిమా ఫలితం ఎలా ఉంటుందని అనుకున్నా.
ఆ సమయంలో స్వామిజీ ఒక మాట చెప్పారు 'కంగారుపడొద్దు.. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది.' అని అన్నారు. స్వయంగా ఆయనే ఆ మాట చెప్పారంటే ఇంకెందుకు ఆలోచించడం.. తప్పకుండా 'జైలర్' హిట్ అయినట్టే అని రజనీ అన్నారు. ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు వసూళ్లు చేసిందని సినీ ట్రేడర్స్ అంచనా వేశారు.
Superstar FIRST speech after Jailer release.
— Manobala Vijayabalan (@ManobalaV) August 12, 2023
"#Jailer released with lot of expectations. Swamiji said don't worry, picture will become HIT. If he himself says, then #Jailer is hit only" - #Rajinikanth pic.twitter.com/jEiGdzbJsd
(ఇదీ చదవండి: జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!)
Comments
Please login to add a commentAdd a comment