వారణాసి: దివంగత ప్రసిద్ధ షెహనాయ్ వాద్యకారుడు, భారతరత్న పురస్కార గ్రహీత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పద్మ విభూషణ్ ధ్రువపత్రంలో కొంత భాగాన్ని చెదలు తిన్నాయి. సోమవారం బిస్మిల్లా ఖాన్ 11వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన వస్తువులను శుభ్రం చేసి సర్దుతుండగా ఈ విషయాన్ని గుర్తించారు.
1980లో నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా బిస్మిల్లా ఖాన్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో భారత రత్న అందుకున్న ఖాన్ 2006లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఖాన్ ఉపయోగించిన సంగీత వాద్యాలు, సాధించిన పురస్కారాలు, ధ్రువపత్రాలను సంరక్షించేందుకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ ఆయన మనవడు వాపోయారు.