నేను చాలా సాధించాలి | Income Tax Department welcomes Padma Bhushan Kamal Haasan | Sakshi
Sakshi News home page

నేను చాలా సాధించాలి

Published Wed, Feb 26 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

నేను చాలా సాధించాలి

నేను చాలా సాధించాలి

 ‘‘నేను సాధించింది చాలా తక్కువ. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.’’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు సకలకళా వల్లభుడు, పద్మశ్రీ కమల్ హాసన్. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక అన్నాశాలైలోని రాణి సీతై హాలులో గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీతం సాహిత్యం, నాటక రంగం తదితర మూడు విభాగాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుమారు 200 మంది పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ ప్రధానాధికారి రవి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమల్ జోతిప్రజ్వలన చేసి అనంతరం ప్రసంగించారు. కళారంగంలో తాను సాధించింది చాలా తక్కువన్నారు. సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ శాఖ ఐజీ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement