నూకల చిన సత్యనారాయణ కన్నుమూత | Nookala Chinna Satyanarayana dead in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 11 2013 2:51 PM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM

ప్రముఖ కళాకారుడు నూకల చిన సత్యనారాయణ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు సికింద్రబాద్‌లోని స్వగృహంలో మరణించారు. 20 ఎళ్ళకు పైగా టిటిడి అస్థాన విద్వాంసుడిగా పనిచేసిన చిన సత్యనారాయణ... 2010లో పద్మభూషన్ అవార్డు అందుకున్నారు. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, సినారే ఆయనకు అత్యంత సన్నిహితులు. బాలమురళీకృష్ణ తండ్రి పట్టాబిరామయ్య వద్ద చిన్నసత్యనారాయణ సంగీతం అభ్యసించారు. సంగీతంపై 12 పుస్తకాలు వెలువరించారు. తిరుపతి, హైదరాబాద్, విజయనగరం సంగీత కళాశాలల్లో ప్రిన్సిపల్‌గా కూడా చినసత్యనారాయణ పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు కళాకారులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement