ఎంఎస్ ధోని (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అతని అభిమానులకు ఏప్రిల్ 2 ఓ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోని.. ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో ధోనీని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించనుంది.
ధోనీతోపాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ కూడా పద్మ భూషణ్ అందుకోనున్నాడు. ఇక గత మార్చి 20న తొలి బ్యాచ్‌కు ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. క్రీడల విభాగంలో టెన్నిస్ ఆటగాడు సోమదేవ్ దేవర్మన్, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్, 1972 పారాలింపిక్స్ స్వర్ణ విజేత, స్మిమ్మర్ మురళీకాంత్ పటేకర్‌లు ఈ అవార్డులు అందుకున్నారు.
28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. 2011, ఏప్రిల్ 2న ధోనీ సారథ్యంలోని టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు ధోని దేశ మూడో అత్యున్నత పురస్కారం అందుకోవడం విశేషం. ధోని భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం గతంలోనే పద్మశ్రీతో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment