Hero Suhas Comments on 'Writer Padmabhushan Movie' In Vijayawada - Sakshi
Sakshi News home page

Writer Padmabhushan: ‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’

Published Mon, Jul 11 2022 10:32 AM | Last Updated on Mon, Jul 11 2022 11:45 AM

Writer Padmabhushan Movie Team In Vijayawada - Sakshi

మాట్లాడుతున్న హీరో సుహాస్, హీరోయిన్‌ టీనా కల్పరాజ్, నిర్మాత శరత్‌ 

లబ్బీపేట(విజయవాడతూర్పు): రైటర్‌ పద్మభూషణ్‌ చిత్రయూనిట్‌ ఆదివారం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మూవీ బృందం పాటను రిలీజ్‌ చేశారు. అనంతరం హీరో సుహాస్‌ మాట్లాడుతూ రైటర్‌ పద్మభూషణ్‌ అందరినీ అలరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, షూటింగ్‌ మొత్తం విజయవాడలో తీశామని తెలిపారు. ఛాయ్‌ బిస్కట్స్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా తాను చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యానన్నారు.
చదవండి: ఎన్టీఆర్‌ 30: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే!

ఇది ఒక డ్రామా చిత్రమని, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుని బయటకు వెళ్తారన్నారు. మూవీ చూశాక వారం రోజులు మర్చిపోలేరని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా నాకు చాలా స్పెషల్‌ అని, తాను పుట్టి పెరిగిన విజయవాడలో షూటింగ్‌ జరిగిందన్నారు. తాను చదువుకున్న కాలేజీ, భవానీ ఐలాండ్, గాంధీ హిల్స్‌ ప్రతిచోటా షూటింగ్‌ చేశామన్నారు. హీరోయిన్‌ టీనాకల్పరాజ్‌ మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన విషయాలు లాగానే ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయన్నారు. తనను దర్శకుడు బాగా ఎంకరేజ్‌ చేశారన్నారు. నిర్మాత శరత్‌ మాట్లాడుతూ ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement