పెరంబూరు: హాస్య నటుడు వడివేలు పేరు విని చాలా కాలమైంది. హాస్యనటుడిగా ఓహో అని వెలిగిన వడివేలు గత శాసనసభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది.ఆ తరువాత నటుడు విజయకాంత్‌తో వైరం వల్ల అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూరం అయిన పరిస్థితి. కాగా వైగైపులిగా పిలవబడే వడివేలు గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన్ని మీడియా చుట్టు ముట్టింది. వడివేలు మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఒక పెద్ద ఉత్సవానికి సమం అని పేర్కొన్నారు. ప్రజలు తెలివిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ప్రజలకు మంచి కాలం రాబోతోందని అన్నారు. ఎవరు అధికారం చేపట్టినా ప్రజలకు మంచి చేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ తాను బాగుండడం ఇష్టం లేదా? అని వడివేలు ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదా? అన్న ప్రశ్నకు అదంతా ఇప్పుడెందుకు? చిత్రం పూర్తి అయ్యింది. నమస్కారం చెబుతాం అని ఆయన ఆన్నారు.
Comments
Please login to add a commentAdd a comment