ఆ పాత్రకు నేనే కరెక్ట్!
ప్రేమలో ఓడిపోయిన యువకుడి పాత్రలో నటిం చడానికి తానే కరెక్ట్ అని నటుడు జై అన్నారని నవ దర్శకుడు మహేంద్రన్ రాజామణి చెప్పారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎనక్కు వాయ్‌త్త అడిమైగళ్. వాసన్ మూవీస్ పతాకంపై శ్యామ్ సుందర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జై కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి ప్రణీత నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో కరుణాకరన్, నవీన్, కాళీవెంకట్, నాన్ కడవుల్ రాజేంద్రన్, తంబిరామయ్య, వినీత, ఆర్‌ఎన్‌ఆర్.మనోహర్ నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు మహేంద్రన్ రాజామణి మాట్లాడుతూ ఈ చిత్ర టైటిల్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది కాదన్నారు. చిత్రంలోని హీరో అభిమానానికి దాసోహం అయిన స్నేహితుల ఇతివృత్తమే చిత్ర కథ అన్నారు.
ప్రేమలో ఓడిపోయిన హీరోతో అతని స్నేహితులు పడే కష్టాలే చిత్ర కథనం అన్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర కాస్త ప్రతినాయకి ఛాయలతో ఉంటుందన్నారు. ఈ పాత్రకు నటి ప్రణీతను సంప్రదించగా ఆమె అభ్యంతరం చెప్పకుండా అంగీకరించారని తెలి పారు. చిత్రంలోని ఒక పాటను ఎత్తైన కొండపై చిత్రీకరించదలచామన్నారు. అక్కడ హీరోయిన్‌కు కనీస సౌకర్యాలు లేవని, జీప్‌లో మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకోవలసి ఉంటుందన్నారు. అయి నా నటించడానికి సిద్ధపడిన ప్రణీతను అభినం దనలతో ముంచెత్తారు. ఇక నటుడు జై కు కథను చెప్పగా ప్రేమలో ఓడిపోయిన కథానాయకుడి పాత్రకు తానే కరెక్ట్ అని నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఇది బలమైన కథా చిత్రం కాకపోయినా రెండున్నర గంటల సేపు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నమ్మించే చిత్రంగా ఉంటుందని దర్శకుడు మహేంద్రన్ రాజామణి చెప్పారు.