
'హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి' చిత్రానికి సంబంధించిన వివాదం పరిష్కారమైనట్టేనా? అన్న ప్రశ్నకు తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. దర్శకుడు శంకర్ హింసై అరసన్ 23 ఆమ్ పులికేసి చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును కథా నాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం విజయవంతం కావడంతో అదే టీమ్‌తో హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి సీక్వెల్‌ను నిర్మించాలని దర్శకుడు శంకర్ భావించారు.
షూటింగ్ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్‌కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు.
పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్‌కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు, త్వరలోనే హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ‘మహా సముద్రం’ మూవీలో సిద్దార్థ్‌కు అంత రెమ్యునరేషనా?!
Comments
Please login to add a commentAdd a comment