వడివేలుతో సదా | Vadivelu to romance Sada in Ezli Movie? | Sakshi
Sakshi News home page

వడివేలుతో సదా

Published Mon, Mar 23 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

వడివేలుతో సదా

వడివేలుతో సదా

హాస్య నటుడు వడివేలు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో నటి సదా కోలీవుడ్‌కు రీ ఎంట్రీ అవుతున్నారు. తెనాలి రామన్ చిత్రం తరువాత వడివేలు హీరోగా నటిస్తున్న చిత్రం ఎలి.తెనాలిరామన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన యువరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎలి (ఎలుక)లక్షణాలతో వడివేలు కురిపించే హాస్యపు జల్లులే చిత్ర కథ అంటున్నారు దర్శకుడు. జయం రవికి జంటగా జయం చిత్రంలో కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన సదా ఆ తరువాత అజిత్, విక్రమ్, మాధవన్ వంటి స్టార్ హీరోలతో నాయకిగా నటించారు.

తెలుగులోను జయం తదితర చిత్రాల్లో నటించిన సదాకు ఆ తరువాత బాలీవుడ్ ప్రయత్నాలు చేశారు. దీంతో దక్షిణాదిలో అవకాశాలు దూరమయ్యాయి. కోలీవుడ్‌లో సదా నటించిన చివరి చిత్రం పులివేషం. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ చిత్రంలో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకుందామనుకున్న సదా ఆశలు నీరుగారి పోయాయి. ఆ మధ్య విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రంలో సింగిల్ సాంగ్ సదా చేశారు.

 అనివార్య కారణాల వలన ఆ చిత్రం విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితిలో చాలా గ్యాప్ తరువాత ఈ భామ వడివేలు చిత్రం ఎలి చిత్రంలో ప్రత్యక్షం అవుతున్నారు. ఈ చిత్రంలో సదా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని దర్శకుడు యువరాజ్ వెల్లడించారు. చిత్ర షూటింగ్ సగభాగం పూర్తి అయ్యిందని, మే నెల కల్లా చిత్ర నిర్మాణం పూర్తి చేసి సమ్మర్ స్పెషల్‌గా ఎలిని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement