'వడివేలు సినిమాను అడ్డుకుంటాం' | Telugu Association warns to stop vadivelu movie | Sakshi
Sakshi News home page

'వడివేలు సినిమాను అడ్డుకుంటాం'

Published Tue, Apr 15 2014 2:04 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

'వడివేలు సినిమాను అడ్డుకుంటాం'

'వడివేలు సినిమాను అడ్డుకుంటాం'

చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామన్‌గా ద్విపాత్రాభినయం చేసిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ చిత్రంపై వివాదం ముదురుతోంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రను జోకర్‌గా చిత్రీకరించడంపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనికి నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాల ఐక్యవేదిక ఆందోళన కొనసాగిస్తోంది. ప్రధానపాత్ర పోషించిన వడివేలుకు వ్యతిరేకంగా తెలుగు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను చిత్రాన్ని కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు వినతిపత్రం సమర్పించారు.

మరోవైపు వడివేలుకు తమిళ చిత్రపరిశ్రమ బాసటగా నిలిచింది. కళాకారుడైన వడివేలు జోలికి వస్తే తమిళులంతా ఏకమవుతారని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ తెలుగు సంఘాల వారిని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement