వడివేలుకు అండగా కోలీవుడ్ | kollywood support to vadivelu | Sakshi
Sakshi News home page

వడివేలుకు అండగా కోలీవుడ్

Published Sat, Apr 12 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

వడివేలుకు అండగా కోలీవుడ్

వడివేలుకు అండగా కోలీవుడ్

తెనాలిరామన్ చిత్ర వ్యవహారం ఆ చిత్ర హీరో వడివేలుకు తమిళ చిత్ర పరిశ్రమ అండగా నిలబడుతోంది. కొన్ని తెలుగు సంఘాలు ఆయ న ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమం చేపట్టడాన్ని తమిళ సినీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, నిన్న దర్శకుడు గౌతమన్‌లు ఖండన తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. తాజాగా స్టంట్ మాస్టర్ జాగ్వర్ తంగం, వడివేలుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. జెకొవా ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై జోష్వా రేవదాస్ నిర్మిస్తున్న చిత్రం కాదల్ పంచాయిత్తు.
 
నవ నటుడు రేవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. వి.కలైశంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి జాన్సన్ సంగీత స్వరాలు కట్టారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లోనే జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు పేపరసు మాట్లాడుతూ నవ హీరోలు రజనీకాంత్‌లా బిల్డప్ ఇస్తూ నటించరాదన్నారు. తాను తిరుపాచ్చి చిత్రం రూపొందిస్తున్నప్పుడు ఆ చిత్రం కోసం నీఎంద ఊరు నాన్ ఎంద ఊరు అనే పాటను రికార్డ్ చేసి చిత్ర హీరో విజయ్‌కి వినిపించగా ఇంత బిల్డప్ పాట అవసరమా అంటూ అడిగారన్నారు.
 
అప్పటికే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉన్నా ఆ పాటలో నటించడానికి సంకోచించారన్నారు. కాబట్టి వర్ధమాన హీరో తొలి రోజుల్లోనే ఓపెనింగ్ సాంగ్స్, పంచ్ డైలా గ్స్ అంటూ బిల్డప్‌ల జోలికి పోకుండా సహజత్వానికి ప్రాముఖ్యతనిస్తూ ఒక్కో మెట్టూ ఎదగాలని సూచిస్తున్నట్లు పేపరసు వ్యాఖ్యానించారు. అనంతరం స్టంట్ మాస్టర్ జాగ్వర్ తంగం మాట్లాడుతూ తెనాలి రామన్ వ్యవహారంలో కొన్ని సంఘాలు వడివేలుపై దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు.
 
దీన్ని తీవ్రం గా ఖండిస్తున్నామని అన్నారు. వడివేలుపై దాడి చేయాలని ప్రయత్నించినా? తెనాలి రామన్ చిత్ర విడుదలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలైపులి ఎస్.ధాను, పి.ఎల్ తేనప్పన్, పట్టియార్ శేఖర్, దర్శకుడు సురాజ్  పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement