tenaliraman
-
పరిష్కారమైన తెనాలి రామన్ సినిమా వివాదం
-
వడివేలుకు అండగా కోలీవుడ్
తెనాలిరామన్ చిత్ర వ్యవహారం ఆ చిత్ర హీరో వడివేలుకు తమిళ చిత్ర పరిశ్రమ అండగా నిలబడుతోంది. కొన్ని తెలుగు సంఘాలు ఆయ న ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమం చేపట్టడాన్ని తమిళ సినీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, నిన్న దర్శకుడు గౌతమన్లు ఖండన తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. తాజాగా స్టంట్ మాస్టర్ జాగ్వర్ తంగం, వడివేలుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. జెకొవా ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై జోష్వా రేవదాస్ నిర్మిస్తున్న చిత్రం కాదల్ పంచాయిత్తు. నవ నటుడు రేవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వి.కలైశంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి జాన్సన్ సంగీత స్వరాలు కట్టారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లోనే జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు పేపరసు మాట్లాడుతూ నవ హీరోలు రజనీకాంత్‌లా బిల్డప్ ఇస్తూ నటించరాదన్నారు. తాను తిరుపాచ్చి చిత్రం రూపొందిస్తున్నప్పుడు ఆ చిత్రం కోసం నీఎంద ఊరు నాన్ ఎంద ఊరు అనే పాటను రికార్డ్ చేసి చిత్ర హీరో విజయ్‌కి వినిపించగా ఇంత బిల్డప్ పాట అవసరమా అంటూ అడిగారన్నారు. అప్పటికే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉన్నా ఆ పాటలో నటించడానికి సంకోచించారన్నారు. కాబట్టి వర్ధమాన హీరో తొలి రోజుల్లోనే ఓపెనింగ్ సాంగ్స్, పంచ్ డైలా గ్స్ అంటూ బిల్డప్‌ల జోలికి పోకుండా సహజత్వానికి ప్రాముఖ్యతనిస్తూ ఒక్కో మెట్టూ ఎదగాలని సూచిస్తున్నట్లు పేపరసు వ్యాఖ్యానించారు. అనంతరం స్టంట్ మాస్టర్ జాగ్వర్ తంగం మాట్లాడుతూ తెనాలి రామన్ వ్యవహారంలో కొన్ని సంఘాలు వడివేలుపై దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. దీన్ని తీవ్రం గా ఖండిస్తున్నామని అన్నారు. వడివేలుపై దాడి చేయాలని ప్రయత్నించినా? తెనాలి రామన్ చిత్ర విడుదలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలైపులి ఎస్.ధాను, పి.ఎల్ తేనప్పన్, పట్టియార్ శేఖర్, దర్శకుడు సురాజ్ పాల్గొన్నారు -
వడివేలును బెదిరిస్తే తీవ్ర పరిణామాలు : సీమాన్
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.