
శతక్కొట్టుడు...
ఈసారి ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారిస్తున్నారు. ఇక సెంచరీల గురించి చెప్పాల్సిన పని లేదు. ఐర్లాండ్ నుంచి భారత్ దాకా ప్రతి జట్టులోనూ కీలక ఆటగాళ్లు శతక్కొట్టారు. లీగ్ దశలో జరిగిన 42 మ్యాచ్‌లలో ఏకంగా 35 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ ప్రపంచకప్‌లోనూ ఈ స్థాయి దూకుడు కనపడలేదు. డ్రాప్ ఇన్ పిచ్‌లు, మారిన నిబంధనలతో బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతున్నారు.
ఈసారి టోర్నీలో ఇప్పటిరకు సంగక్కర అందరికంటే ఎక్కువగా నాలుగు సెంచరీలు చేశాడు.
దిల్షాన్ (శ్రీలంక), శిఖర్ ధావన్ (భారత్), బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), మహ్మదుల్లా (బంగ్లాదేశ్) రెండేసి శతకాలు సాధించారు.
మరో 23 మంది క్రికెటర్లు ఈసారి ప్రపంచకప్‌లో ఒక్కో సెంచరీ చేశారు.
1975లో తొలి ప్రపంచకప్ మొత్తంలో నమోదైన సెంచరీలు ఆరు మాత్రమే. 1979లో కేవలం రెండు శతకాలు మాత్రమే వచ్చాయి.
1983లో ఏడు, 1987లో 11 సెంచరీలు నమోదయ్యాయి.
1992లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోనే జరిగిన టోర్నీలో 8 సెంచరీలు మాత్రమే వచ్చాయి.
2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో 21 శతకాలు వచ్చాయి. 2007లో 20, 2011లో 24 సెంచరీలు నమోదయ్యాయి.
ప్రపంచకప్‌లలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్ డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్).
అందరికంటే ఎక్కువగా సచిన్ టెండూల్కర్ (భారత్) ఆరు శతకాలు సాధించాడు. సంగక్కర, పాంటింగ్ ఐదేసి సెంచరీలు చేశారు.