టీమిండియా తాజాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శతక్కొట్టిన కోహ్లి.. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని, ఓవరాల్‌గా 71 శతకాన్ని నమోదు చేశాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 1020 రోజుల పాటు మూడంకెల స్కోర్ చేయకపోయినా గణాంకాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కోహ్లి మూడేళ్లకు పైగా సెంచరీ సాధించకపోయినా, సచిన్ కంటే ఓ ఇన్నింగ్స్ ముందుగానే తన 71వ శతకాన్ని నమోదు చేయడం మరో విశేషం.
సచిన్ 71 శతకాల మార్కును 523 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. కోహ్లి 522 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ శతకాలను పూర్తి చేశాడు. 71 సెంచరీల తర్వాత మిగతా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్ కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాడు. సచిన్ 71 సెంచరీలు నమోదు చేసే క్రమంలో 49.51 సగటున 23,274 పరుగులు సాధించగా.. కోహ్లి ఇదే మార్కును చేరుకునే క్రమంలో 53.81 సగటున 24,002 రన్స్ స్కోర్ చేశాడు. అర్ధసెంచరీల విషయంలోనూ కోహ్లి.. సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 523 ఇన్నింగ్స్‌ల తర్వాత సచిన్ 107 హాఫ్ సెంచరీలు సాధించగా.. కోహ్లి 124 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు.
ఇవే కాకుండా స్ట్రయిక్ రేట్ ఇతరత్రా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్‌తో పోలిస్తే కాస్త బెటర్‌గానే ఉన్నాడు. కాగా, కేవలం గణాంకాల్లో మెరుగ్గా ఉన్నాడని సచిన్ కంటే కోహ్లి అత్యుత్తమ ఆటగాడని చెప్పలేని పరిస్థితి. ఇద్దరు తమతమ హయాంలో అత్యుత్తమ ఆటగాళ్లన్నది కాదనిలేని సత్యం. కోహ్లి గణాంకాల పరంగా ప్రస్తుతం సచిన్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల మార్కు అందుకోవడం కోహ్లికి అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 33 ఏళ్ల వయసున్న కోహ్లి మరో మూడు నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడినా హండ్రెడ్ హండ్రెడ్స్ మార్కును అందుకోలేడని సచిన్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
చదవండి: కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..!
Comments
Please login to add a commentAdd a comment