సెంచూరియన్ : అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాట్ పడితే చాలు మంచి నీళ్లు ప్రాయంలా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో రికార్డుల పంట పండించాడు.
ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో సెంచరీతో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(13), కోహ్లి(13)లు రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11) రికార్డును ఇటీవలే కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లి(14 సెంచరీలు) పేరిటే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment