Indian captain Virat Kohli
-
టీ20 కెప్టెన్ పదవికి కొహ్లీ గుడ్ బై
-
కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై!
Virat Kohli-T20 Captaincy: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. ‘‘టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, నా కోచ్‌లు, ప్రతీ భారతీయుడికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం, గత 5-6 ఏళ్లుగా కెప్టెన్సీ కారణంగా వర్క్‌లోడ్ ఎక్కువైంది. కాస్త విశ్రాంతి కోరుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్‌గా నా బెస్ట్ ఇచ్చాను. ఇకపై బ్యాట్స్‌మెన్‌గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతాను. నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులతో చర్చించాను. లీడర్షిప్ గ్రూపులో కీలకమైన రవి భాయ్, రోహిత్‌తో కూడా మాట్లాడాను. అందుకే దుబాయ్‌లో అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతా. ఈ విషయం గురించి సెక్రటరీ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో మాట్లాడాను. వన్డే, టెస్టు కెప్టెన్‌గా నా శక్తిమేర జట్టును ముందుకు నడిపిస్తాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి నిర్ణయంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌కు టీమిండియా టీ20 కెప్టెన్సీ దక్కడం లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది. (చదవండి: Sustainable Cities and Society Study: ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదు) T20 World Cup: అశ్విన్‌కు అది కన్సోలేషన్ ప్రైజ్ లాంటిది.. తుదిజట్టులో ఉంటాడా? 🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J — Virat Kohli (@imVkohli) September 16, 2021 -
కెప్టెన్‌గా కోహ్లి సాధించిందేం లేదు
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరో సారి విమర్శకు దిగాడు. ఇప్పటి వరకు సారథిగా విరాట్ కోహ్లి గొప్పగా చెప్పుకోవడానికేమీ లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. బ్యాట్స్‌మన్‌గా అన్ని ఫార్మాట్లలో ఆటగాడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్... కెప్టెన్‌గా సాధించాల్సింది చాలా ఉందని అభిప్రాయ పడ్డాడు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే గొప్ప సారథుల జాబితాలో కోహ్లికి చోటు దక్కుతుందని అతను అన్నాడు. జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను సరిగా గుర్తించి వారిని ప్రోత్సహించినప్పుడు మాత్రమే మెగా ఈవెంట్లలో భారత్ టైటిల్ గెలిచే అవకాశముంటుందని పేర్కొన్నాడు. ‘నిజం చెప్పాలంటే భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి గొప్ప విజయాలేమీ సాధించలేదు. బ్యాట్స్‌మన్‌గా విరాట్ భారీగా పరుగులు చేస్తున్నాడు. మిగతా వారిలో అతను ప్రత్యేకం. కోహ్లిలా ఇతరులు పరుగులు సాధించలేకపోవచ్చు కానీ కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను అతను బయటకి తీయాలి. తన సామర్థ్యంతో వారిని పోల్చకూడదు. ఎవరికి వారే ప్రత్యేకం కాబట్టి వారిలో అత్యుత్తమ ఆట బయటకు వచ్చేలా కోహ్లి ప్రోత్సహించాలి. వరల్డ్‌కప్ లాంటి మెగా టైటిళ్లు గెలిస్తేనే గొప్ప. లేకుంటే కెరీర్లో అదో లోటుగా మిగిలిపోతుంది. ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్ గెలవడంతో పాటు జట్టును నంబర్‌వన్‌గా నిలిపి టెస్టుల్లో కోహ్లి కెప్టెన్‌గా మంచి ఘనతలు సాధించాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ విజయాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. 2018 ఆసియా కప్ కూడా రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలుపొందింది’ అని గంభీర్ గుర్తు చేశాడు. -
కోహ్లి మరో రికార్డు
సెంచూరియన్ : అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాట్ పడితే చాలు మంచి నీళ్లు ప్రాయంలా ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో రికార్డుల పంట పండించాడు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో సెంచరీతో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(13), కోహ్లి(13)లు రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(11) రికార్డును ఇటీవలే కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లి(14 సెంచరీలు) పేరిటే ఉంది. -
విరాట్ విశ్వరూపం.. అశ్విన్ అదుర్స్
► కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ ► తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ► తొలి ఇన్నింగ్స్ 566/8 (డిక్లెర్డ్) నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ (283 బంతుల్లో 200; 24 ఫోర్లు)కి తోడు ఆల్ రౌండర్ అశ్విన్ సెంచరీ (253 బంతుల్లో 113 ; 12 ఫోర్లు) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడంతో భారీ స్కోరు చేసింది. దీంతో రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 566 పరుగుల వద్ద అమిత్ మిశ్రా(68 బంతుల్లో 53; 6 ఫోర్లు) 8వ వికెట్ గా ఔట్ కాగానే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ, అశ్విన్ మొదట డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. విండీస్ పేసర్లు బౌన్సర్లు, పదునైన పేస్ బౌలింగ్‌తో దాడులు చేసినా వీరు మాత్రం ఒత్తిడికి గురికాలేదు. 43 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. విరాట్ కూడా జోరు చూపడంతో తొలి సెషన్లో భారత్ వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది. కానీ లంచ్ తర్వాత రెండో బంతికే గాబ్రియెల్ బౌలింగ్ లో కోహ్లి అవుట్ కావడంతో ఐదో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రాత్వైట్కు మూడు వికెట్లు కోహ్లి ఔటయ్యాక క్రీజులోకొచ్చిన సాహా (88 బంతుల్లో 40; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. అయితే బ్రాత్ వైట్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా సాహా స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిశ్రా సహకారంలో అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాత్ వైట్ మరోసారి భారత్‌ను దెబ్బతీశాడు. స్కోరు వేగాన్ని పెంచేందుకు యత్నించిన అశ్విన్ బ్రాత్‌వైట్ బౌలింగ్ లో గాబ్రియెల్ కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షమీ(9 బంతుల్లో 17; 2 సిక్సులు) దూకుడుగా ఆడుతుంటే మరోవైపు మిశ్రా హాఫ్ సెంచరీ (53) చేసి బ్రాత్ వైట్ బౌలింగ్ లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పటికి 161.5 ఓవర్లలో భారత్ స్కోరు 566/8. మిశ్రా ఔట కాగానే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ, బ్రాత్‌వైట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, గాబ్రియెల్ రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ కు దిగిన విండీస్ 16 ఓవర్లలో వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (11), బిషూ(0) క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.