జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు తలపడనుంది. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి.. తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. కాగా టీమిండియా చివరగా 2013లో ధోని సారధ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. దాదాపు 10 ఏళ్లగా అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ ట్రోఫీని.. కనీసం రోహిత్ శర్మ అయినా అందిస్తాడో లేదో వేచి చూడాలి. అయితే రోహిత్‌కు ఇది కెప్టెన్‌గా తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ కావడం కావడం గమనార్హం. అంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్-2021 ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. విరాట్ కోహ్లి సారధ్యంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే తుదిపోరులో ఓటమి పాలైన టీమిండియా రన్నరప్‌గా నిలిచింంది.
అరుదైన రికార్డుకు చేరువలో..
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్-2023కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్‌గా బరిలోకి దిగితే.. ఐసీసీ ఈవెంట్ ఫైనల్‌లో భారత జట్టు సారధ్యం వహించిన ఐదో కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కుతాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ధోనితో పాటు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు.
కాగా ఐసీసీ టోర్నీలో ఫైనల్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన జాబితాలో ఆగ్రస్ధానంలో కపిల్ దేవ్ ఉన్నాడు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన జాబితాలో కపిల్ దేవ్ తర్వాత సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దాదా 2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అనంతరం మూడో స్థానంలో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధోని టీమిండియాకు నాయకత్వం వహించాడు. కాగా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో భారత జట్టుకు సారధ్యం వహించిన భారత కెప్టెన్ కూడా ధోనినే కావడం గమనార్హం. ఇక నాలుగో కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఉన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి ఉన్నాడు.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా
Comments
Please login to add a commentAdd a comment