
సాక్షి, న్యూఢిల్లీ : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ కోలుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని, రెండు మూడురోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. కాగా కపిల్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్యానా హరికేన్ శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ‍్క్షతలు తెలిపారు. (కపిల్‌దేవ్‌కు గుండెపోటు)
Comments
Please login to add a commentAdd a comment