Kapil Dev Reaction On Virat Kohli Test Captaincy Retirement Decison, Check Details - Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లి ఇగోను వదిలేయాలి.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడాలి.. నేనూ అలా ఆడినవాడినే: టీమిండియా దిగ్గజం

Published Mon, Jan 17 2022 10:01 AM | Last Updated on Mon, Jan 17 2022 11:45 AM

Virat Kohli Quit Captaincy: Kapil Dev Says Kohli Will Have To Give Up Ego - Sakshi

Virat Kohli Quit Test Captaincy: టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి ప్రస్థానం పూర్తిగా ముగిసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఇప్పటికే పగ్గాలు చేపట్టగా.. టెస్టు సారథి ఎవరన్న అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ వంటి యువ ఆటగాళ్ల సారథ్యంలో కోహ్లి ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్‌ దూరం కాగా.. రాహుల్‌ నేతృత్వం వహించనున్నాడు. ఈ జట్టులో కోహ్లి సభ్యుడుగా ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్‌, అజారుద్దీన్‌ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు. 

ఒత్తిడికి లోనయ్యాడు..
తాజా పరిణామాల గురించి కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ.. ‘‘టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న నాటి నుంచి అతడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. బ్యాటర్‌గా తను మరింత స్వేచ్చగా ఆడటానికి కెప్టెన్సీ వదులుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈ ఆప్షన్‌ను తను ఎంచుకోవడం మంచిదే. 

తను పరిణతి కలిగిన వాడు. ఇంతటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటాడు. కెప్టెన్సీని భారంగా భావించినట్లున్నాడు. అందుకే ఇలా చేసి ఉంటాడు. అయితే, ఒక విషయం మాత్రం తప్పక చెప్పుకోవాలి. కోహ్లి ఇప్పుడు తన ఇగోను వదిలేసి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సిన పరిస్థితి. నిజానికి సునిల్‌ గావస్కర్‌ నా సారథ్యంలో ఆడాడు. 

నేను క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ నేతృత్వంలో ఆడాను. నామోషీ అనుకోలేదు. కోహ్లి కూడా అంతే. అహాన్ని పక్కన పెట్టాలి. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేయాలి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లకు అతడు దిశా నిర్దేశం చేయాలి. ఒక బ్యాటర్‌గా కోహ్లి సేవలను కోల్పోవడం అంటే భారత జట్టుకు తీర్చలేని లోటు. కాబట్టి తను ఆడాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మిడ్‌ డేతో కపిల్‌ దేవ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్‌కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్‌, కేకేఆర్‌ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం!
India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement