టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు? భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. విరాట్ కోహ్లి వంటి విజయవంతమైన సారథి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా రోహిత్ శర్మకే ఉందని, అతడి ఎంపిక ఖాయమేననే వాదనలు వినిపిస్తున్నా... వయసు, ఫిట్‌నెస్ వంటి అంశాలు హిట్‌మాన్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మరోవైపు... కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే, దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సారథిగా రాహుల్ పూర్తిగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో గాయం కారణంగా రెండో టెస్టుకు కోహ్లి దూరం కాగా... తొలిసారిగా రాహుల్ పగ్గాలు చేపట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇక ఇటీవలే వన్డే వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.... రోహిత్ శర్మ గైర్హాజరీలో తొలిసారిగా వన్డే సిరీస్‌కు సారథ్యం వహించాడు. ఇందులో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సిరీస్‌లో 0-3 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి రాహుల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సదరు అధికారిని.. టెస్టు కెప్టెన్సీ విషయంలో రాహుల్‌కు ఉన్న అవకాశాల గురించి చెప్పమని కోరారు. ఇందుకు బదులుగా.. ‘‘అసలు... కేఎల్ రాహుల్ ఏ కోశాన్నైనా మీకు కెప్టెన్‌గా కనిపిస్తున్నాడా?’’ అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇంతకీ.. రాహుల్ టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నాడా లేడా అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Ind Vs Sa 3rd ODI: రాహుల్ చక్కగా కెప్టెన్సీ చేశాడు.. ఇదో కనువిప్పు: ద్రవిడ్
SA vs IND 3rd ODI: 'కెప్టెన్‌గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు'
Comments
Please login to add a commentAdd a comment