టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ యువ క్రికెటర్ సంజూ శాంసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడుతాడని.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన కొనసాగించడంలో విఫలమవుతాడని పేర్కొన్నాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ''రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే జట్టులో యువ ఆటగాళ్లకు కొదువలేదు. అన్ని విభాగాల్లోకెల్లా మనకు నలుగురు వికెట్ కీపర్లు అందుబాటులో ఉంటారు. ఆ నలుగురే సంజూ శాంసన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, ఇషాన్ కిషన్‌లు. విడివిడిగా చూస్తే ఈ నలుగురు ఎవరికి వారే.
బ్యాటింగ్, స్టంపింగ్ చేయడంలో మంచి నైపుణ్యం కలిగినవారు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. అయితే నా దృష్టిలో ఒక వికెట్ కీపర్ మాత్రం నిలకడ చూపించలేకపోతున్నాడు. ఆ క్రికెటర్ సంజూ శాంసన్. కెప్టెన్‌గా అతను సమర్థుడే కావొచ్చు.. టాలెంట్‌కు కొదువ లేదు. కానీ వరుసగా అవకాశాలు ఇస్తే సంజూ ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతాడు. ఇదొక్కటే అతనిలో ఉన్న మైనస్ పాయింట్.'' అని చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్బుత ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచింది. సంజూ కెప్టెన్సీలో లీగ్ దశలో మంచి విజయాలు సాధించిన రాజస్తాన్ రెండో సారి ఫైనల్ చేరినప్పటికి.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 17 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేసిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. బట్లర్ ఖాతాలో నాలుగు సెంచరీలు ఉండడం విశేషం.
చదవండి: దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment