విరాట్ కోహ్లి(PC: BCCI)
గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఫామ్‌లేమి కారణంగా కెరీర్‌లో విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది అతడికి అండగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కోహ్లితో కాసేపు ముచ్చటించే సమయం దొరికితే అతడి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. తన సలహాలు కోహ్లికి ప్రయోజనకరంగా ఉంటాయో లేదో తెలీదన్న ఆయన.. ప్రయత్నం చేయడంలో తప్పేమీ ఉండదు కదా అని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఇండియా టుడేతో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడితో 20 నిమిషాలు మాట్లాడే సమయం దొరికితే చాలు.. తను చేయాల్సిన పనులేమిటో.. తక్షణ కర్తవ్యం ఏమిటో చెబుతాను. నా సూచనలు అతడికి ఉపయోగపడొచ్చు!
ముఖ్యంగా ఆఫ్ స్టంప్ లైన్ విషయంలో తనకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నా. ఓపెనింగ్ బ్యాటర్‌గా నేను కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డాను. ఆఫ్‌స్టంప్ అవతల పడే బంతులను ఎలా ఎదుర్కోవాలో చెప్తాను. ఒక్క 20 నిమిషాలు చాలు. తనకు వీటి గురించి వివరించడానికి’’ అని పేర్కొన్నారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న కోహ్లి పట్ల దృష్టికోణం కాస్త వేరుగా ఉండాలన్న గావస్కర్.. అతడు 70 సెంచరీలు చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.ఎంతటి ఆటగాడికైనా కెరీర్‌లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని కోహ్లి విషయంలో కాస్త ఓపిక పట్టాలని విమర్శకులకు సూచించారు. కాగా కోహ్లిని జట్టు నుంచి తప్పించాలంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించిన సందర్భంలోనూ గావస్కర్ ఈ మాజీ సారథికి అండగా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు!
Trolls On Virat Kohli: వీడియో షేర్ చేసిన కోహ్లి! నువ్వు ఇందుకే పనికివస్తావంటూ ట్రోలింగ్..
Comments
Please login to add a commentAdd a comment