రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నవారిలో 1983 వరల్డ్ కప్ నెగ్గిన భారత మాజీ క్రికెటర్లు చేరారు. కపిల్‌దేవ్ నేతృత్వంలో ఈ బృందం సంయుక్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. ‘మన చాంపియన్ రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధ వేసింది. వారి ఫిర్యాదులు విని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అయితే తమ పతకాలను పడేయడం వంటి తీవ్రమైన పనులు చేయవద్దని రెజ్లర్లను కోరుతున్నాం. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, త్యాగాల ఫలితం ఆ పతకాలు’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ‘సంయుక్త ప్రకటన’తో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఈ జట్టులో సభ్యుడైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశారు.
మరో వైపు నిందితుడిని ప్రధాని మోదీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిన మన బిడ్డలు న్యాయం కోసం వీధికెక్కారు. 15 తీవ్ర ఆరోపణలతో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన వ్యక్తి ప్రధాన రక్షణ కవచంలో ఉన్నాడు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
చదవండి: IRE VS ENG One Off Test: టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..?
Comments
Please login to add a commentAdd a comment