
PC: X
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో.. భారత్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.
దిగ్గజ బ్యాటర్
ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్‌తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్‌కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.
శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.
పార్ట్‌టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.
శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూ
శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.
ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్‌లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది.
చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’
Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u
— Rex Clementine (@RexClementine) July 16, 2024