చాలా మంది క్రికెటర్లు లార్డ్స్ క్రికెట్ స్టేడియాన్ని దేవాలయంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్ మైదానంలో ఆడలాని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. కాగా ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 35 సంవత్సరాల క్రితం 1986 లో ఈ రోజున తొలి విజయాన్ని నమోదుచేసుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా అతిథ్య ఇంగ్లండ్ జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కపిల్‌దేవ్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అవ్వగా , రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. ఇంగ్లండ్ జట్టులో తొలి ఇన్సింగ్స్‌లో గ్రహమ్ గూచ్ 114 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 341 పరుగులను చేయగా రెండో ఇన్సింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులను చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ విజయానికి 23 పరుగుల దూరంలో క్రీజులోకి వచ్చిన కపిల్‌దేవ్ కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్‌కు లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైయ్యాడు
టీమిండియా నుంచి తొలి ఇన్నింగ్స్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ 126 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో తొలి విజయాన్నిఅందుకున్న భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌తో అతిథ్య ఇంగ్లండ్ జట్టును ముప్ఫుతిప్పలు పెట్టారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో రోజర్ బిన్నీ, చేతన్ శర్మ, మొహిందర్ అమర్‌నాథ్, రవిశాస్త్రి, మనీందర్ సింగ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టు తరపున ఆడారు.
ప్రస్తుత టీమిండియా జట్టు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు సిద్దమౌతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లార్డ్స్ మైదానంలో టీమిండియా తొలి విజయం.. నేటితో 35 ఏళ్లు
Published Thu, Jun 10 2021 5:08 PM | Last Updated on Thu, Jun 10 2021 5:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment