టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. మరి అంతలా షేక్ చేస్తున్న ఆ ఫోటోలో ఏముందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1992 వరల్డ్‌కప్‌కు సంబంధించి ప్రతిష్టాత్మక సిడ్నీ హార్బర్‌లో దిగిన రెండు ఫోటోలను అజారుద్దీన్ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. తొలి ఫోటోలో ఆ వరల్డ్‌కప్‌లో పాల్గొన్న తొమ్మిది దేశాల కెప్టెన్లు.. ఇక రెండో ఫోటోలో టీమ్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అజారుద్దీన్.. ''1992 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా. సిడ్నీ హార్బర్ వేదికగా జట్లతో పాటు కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. అయితే ఈ ఫోటోలో ఒక గ్రేట్ ఆల్‌రౌండర్ మిస్ అయ్యాడు.. ఎవరో కనుక్కోండి'' అని క్యాప్షన్ జత చేశాడు.
అజారుద్దీన్ ఎవరి గురించి చెబుతున్నాడో క్రికెట్ ఫ్యాన్స్ పసిగట్టేశారు. మిస్ అయింది ఎవరో కాదు.. టీమిండియా గ్రేట్‌స్ట్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. ఎమర్జెన్సీ పని ఉండడంతో కపిల్ దేవ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కపిల్ జీ ఈ ఫోటోషూట్‌కు మిస్సయ్యాడు. అజారుద్దీన్ షేర్ చేసిన ఫోటోను 12,500 మంది వీక్షించారు. వేలాది మంది కపిల్ దేవ్ అంటూ ట్వీట్ చేశారు.
కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి పాక్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగాటోర్నీలో టీమిండియా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన టోర్నీలో టీమిండియా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించడం ఒక్కటే గొప్పగా చెప్పుకోవచ్చు.
చదవండి: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ
కోహ్లి నా సాయం కోరాడు.. సమయం వెచ్చించమని రిక్వెస్ట్ చేశాడు
1992 World Cup in Australia. At Sydney Harbour with the teams and their captains. The greatest all rounder is missing in the picture. Can you guess who? pic.twitter.com/JU0dPAyR2q
— Mohammed Azharuddin (@azharflicks) February 23, 2022
Comments
Please login to add a commentAdd a comment