Kapil Dev Says 'I Love Jadeja's Game Because He Plays Without Pressure' - Sakshi
Sakshi News home page

Kapil Dev: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆట అంటే నాకిష్టం.. ఎందుకంటే: కపిల్‌ దేవ్‌

Published Mon, Mar 14 2022 11:01 AM | Last Updated on Mon, Mar 14 2022 11:32 AM

Kapil Dev Says He Loves Ravindra Jadeja Game Among New Cricketers - Sakshi

Kapil Dev Comments On Jadeja: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో 175 పరుగులతో అజేయంగా నిలవడమే గాక.. 9 వికెట్లు కూల్చి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌ నెంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా జడ్డూ భాయ్‌ నిలిచాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, వరల్డ్‌కప్‌ విజేత కపిల్‌ దేవ్‌.. జడేజాపై ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త తరం క్రికెటర్లలో జడ్డూ ఆట తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని సర్వోదయ ఆస్పత్రిలో జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ రోబో ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘జడేజా ఒత్తిడి లేకుండా ఆడతాడు. అందుకే నవతరం క్రికెటర్లలో అతడి ఆట అంటేనే నాకు ఇష్టం.

తను క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాడు. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్బుతంగా రాణించగలడు. ఫీల్డింగ్‌లోనూ తనకు తానే సాటి. నిజానికి ఓ ఆటగాడు ఒత్తిడికి గురైనట్లయితే ఇవన్నీ చేయలేడు. ఒత్తిడిని అధిగమించాడు కాబట్టే జడేజా మంచి ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నాడు’’ అని కపిల్‌ జడేజాకు కితాబిచ్చారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రిషభ్‌ పంత్‌ టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసి కపిల్‌ దేవ్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 

చదవండి: Ind Vs Sl- Rishabh Pant: ఫార్మాట్‌ ఏదైతే నాకేంటి! పంత్‌ అరుదైన రికార్డు.. ధోని, గిల్‌క్రిస్ట్‌లను ‘దాటేశాడు’! ఇంకా..


  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement