టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.
ఆసీస్‌తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం బరిలోకి దిగాడు. ఈ డే అండ్ నైట్ టెస్టులో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.
అదేవిధంగా కెప్టెన్సీ పరంగా రోహిత్ ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఫామ్, కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. రోహిత్ సామర్థ్యంపై ఎవరికీ సందేహాలు అక్కర్లేదని కపిల్ అన్నారు.
‘రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి. ఏళ్ల తరబడి భారత క్రికెట్‌లో చిరస్మరణీయ విజయాలకు అవసరమైన పరుగులెన్నో చేశాడు. అలాంటి క్రికెటర్ సామర్థ్యంపై ఎవరికీ ఏ సందేహం అక్కర్లేదు. నాకైతే అస్సలే డౌటు లేదు.
త్వరలోనే తన ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడు. ఒకట్రెండు ప్రదర్శనలతోనే ఒక కెప్టెన్ ప్రతిభను అంచనా వేయడం తగదు. ఆ నాయకుడే ఆరు నెలల క్రితం భారత్ టి20 ప్రపంచకప్ అందించాడన్న సంగతి మరిచిపోవద్దు. రోహిత్ మరింత బలంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాను" అని కపిల్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
చదవండి: PKL 2024: తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
Comments
Please login to add a commentAdd a comment