టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తన ప్రదర్శనతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. రీఎంట్రీ ఇస్తూనే బౌలింగ్‌లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న జడేజా.. బ్యాటింగ్‌లో అర్థసెంచరీతో రాణించాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై నింపాదిగా బ్యాటింగ్ చేసి అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో జడ్డూకు ఇది 18వ అర్థశతకం.
ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు సహా అర్థసెంచరీ చేయడం జడేజాకు ఇది ఐదోసారి. ఇంతకముందు కపిల్ దేవ్ నాలుగుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. తాజాగా జడ్డూ ఐదోసారి ఈ ఫీట్ సాధించి కపిల్ రికార్డును చెరిపేసి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో అజేయ అర్థశతకాలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని నిర్ధేశించనుంది.
And the trademark celebration is here 😀😀@imjadeja 💪
— BCCI (@BCCI) February 10, 2023
Live - https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/Q1TPXZVLfE
Comments
Please login to add a commentAdd a comment