Hyd: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్‌ 3 నిర్వహణకు సర్వం సిద్ధం | Hyderabad: Telangana Premier Golf League Auction 2023, Here's The All Details You Should Know - Sakshi
Sakshi News home page

TPGL 2023 Auction: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్‌ 3 నిర్వహణకు సర్వం సిద్ధం

Published Tue, Oct 3 2023 5:07 PM | Last Updated on Tue, Oct 3 2023 5:20 PM

Hyderabad: Telangana Premier Golf League Auction 2023 - Sakshi

హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) మూడో ఎడిషన్‌ నిర్వహణకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో పోటీలో ఉన్న 16 జట్లు.. పూల్‌లోని 215 మంది ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే క్రమంలో వేలంలో చురుగ్గా పాల్గొంటున్నాయి.

కాగా ఐదు వారాల ఈ మెగా ఫెస్టివల్‌లో నాలుగు జట్లతో కూడిన నాలుగు గ్రూపులు లీగ్ ఫార్మాట్‌లో ఆడతాయి. అనంతరం క్వార్టర్‌ఫైనల్‌  నుంచి ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. 

ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారులని ప్రోత్సహించే క్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్  నిర్వహిస్తున్న వార్షిక వేడుక ఇది. లీగ్‌ మద్దతుదారులు, స్పాన్సర్‌ల బృందం  తోడ్పాటుతో  ప్రతి సీజన్‌లో అభివృద్ధి చెందుతోంది. గతేడాది ఫైనల్‌లో.. శ్రీనిధియన్ థండర్‌బోల్ట్స్ విల్లాజియో హైలాండర్స్‌ను 4 -2 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. 
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక గోల్ఫ్ క్లబ్‌ నవ శకానికి నాంది పలికేందుకు ఇటీవల నిర్మించిన న్యూ క్లబ్‌హౌస్‌లో విజయవంతమైన వేలంతో మూడో సీజన్‌  ఆరంభానికి వేదిక సిద్ధమైంది. ఈవెంట్‌ను నిర్వహించే నలుగురు సభ్యుల పాలక మండలి ద్వారా TPGL విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ కౌన్సిల్‌లో చైర్మన్ జయంత్ ఠాగూర్ TPGL నిర్వాహక బృందానికి నాయకత్వం వహిస్తుండగా.. ఆయనకు మద్దతుగా వైస్ చైర్మన్ టి.అజయ్ రెడ్డి (వైస్ చైర్మన్), సభ్యులు డి.వందిత్ రెడ్డి, ఉత్తమ్ సింఘాల్ తమ సేవలు అందిస్తున్నారు. ఈ సీజన్‌ వేలం ద్వారా నిర్వహించబడుతున్న క్రమంలో..  కౌన్సిల్‌కు చెందిన పదహారు మంది ప్రత్యేక ఆహ్వానితులుగా  హాజరై మద్దతు తెలిపారు.

ఈ నేపథ్యంలో జయంత్ ఠాగూర్ (ప్రెసిడెంట్, HGA) మాట్లాడుతూ..  గోల్ఫింగ్ కమ్యూనిటీ కోసం మరో లీగ్‌ని నిర్వహించడం పట్ల తమకు సంతోషంగా ఉందన్నారు. ఇక.. నగర గోల్ఫ్ క్రీడాకారులు ఈ మార్క్యూ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఇక్కడ  గోల్ఫ్ కోర్స్‌ పట్ల ఉత్సాహం తారాస్థాయిలో ఉందని వందిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement