
Hyderabad Premier Golf League: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మరింత రసవత్తరంగా మారింది. గ్రూప్ స్టేజ్‌లో ఆధిక్యం కోసం జట్లన్నీ పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా మూడో సీజన్ సెకండ్ లెగ్ పోటీల్లో అండర్ డాగ్స్ సెంట్రో ఈగల్ హంటర్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 113 పాయింట్లతో అత్యుత్తమంగా రాణించింది. ఈగల్ హంటర్స్ తరపున కేవీఎస్ ఎన్ రెడ్డి, సురేష్ రాణించారు.
అదే విధంగా.. తొలిసారి మహిళలు ఓనర్లుగా ఉన్న ఏకైక గోల్ఫ్ టీమ్ ‘సమా ఏంజెల్స్’ టీమ్.. మూడో సీజన్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. సరోజా వివేక్, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా వ్యవహరిస్తున్న సమా టీమ్ వికారాబాద్‌లోని వూటీ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన మూడో రౌండ్‌లో సత్తా చాటింది.
సరోజా వివేక్, మాధవి సహా టీమ్ గోల్ఫర్లు ఆకట్టుకున్నారు. ఈ రౌండ్‌లో సామా ఏంజెల్స్ 109 పాయింట్లు సాధించింది. సిటీలో జరుగుతున్న అది పెద్ద లీగ్ అయిన హెచ్‌పీజీఎల్‌లో నాలుగు గ్రూప్స్‌లో 16 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఒక్కో టీమ్‌లో 10 మంది గోల్ఫర్లు ఉన్నారు.
ఇక గ్రూప్ దశలో తొలి రెండు రౌండ్లు హెచ్‌సీఏ, బౌల్డర్ హిల్స్‌లో నిర్వహించారు. వచ్చే బుధ, శనివారాల్లో గ్రూప్ దశలో చివరి రౌండ్లు జరుగనున్నాయి. అనంతరం నాకౌట్ రౌండ్ ఆరంభమవుతుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు టీమ్స్ క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. వచ్చే నెల 24న థాయ్‌లాండ్‌లో ఫైనల్స్‌ను జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా..
Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment