సచిన్ అత్త అనాబెల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కచ్చితంగా ఆటకు టచ్‌లోనే ఉంటాడని అతని అత్త అనాబెల్ మెహతా వెల్లడించారు. అయితే తొందరపడి ఏదో ఓ నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శారీరక ఫిట్‌నెస్ కోసం మాస్టర్... టెన్నిస్ లేదా గోల్ఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.
సచిన్‌కు హౌజ్ ఆఫ్ కామన్స్ అభినందనలు
లండన్: క్రికెట్‌లో అద్భుత కెరీర్‌ను కొనసాగించిన సచిన్ టెండూల్కర్‌ను ఇంగ్లండ్‌కు చెందిన హౌజ్ ఆఫ్ కామన్స్ సభ అభినందించింది. భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ ఈ మేరకు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచాడని, ఇంగ్లండ్‌లోనూ అతడికి భారీగా అభిమానులున్నారని వాజ్ అన్నారు.
మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ‘సచిన్’
ముంబై: సచిన్ టెండూల్కర్ జీవితం ఇకపై స్కూల్ పుస్తకాల్లోనూ కనిపించనుంది. చిన్నారులలో స్ఫూర్తి నింపేందుకు సచిన్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ముందు విశ్రాంతి.. తర్వాతే ఏదైనా
Published Tue, Nov 19 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement