Anabel Mehta
-
ముందు విశ్రాంతి.. తర్వాతే ఏదైనా
సచిన్ అత్త అనాబెల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కచ్చితంగా ఆటకు టచ్‌లోనే ఉంటాడని అతని అత్త అనాబెల్ మెహతా వెల్లడించారు. అయితే తొందరపడి ఏదో ఓ నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శారీరక ఫిట్నెస్ కోసం మాస్టర్... టెన్నిస్ లేదా గోల్ఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. సచిన్‌కు హౌజ్ ఆఫ్ కామన్స్ అభినందనలు లండన్: క్రికెట్లో అద్భుత కెరీర్‌ను కొనసాగించిన సచిన్ టెండూల్కర్‌ను ఇంగ్లండ్‌కు చెందిన హౌజ్ ఆఫ్ కామన్స్ సభ అభినందించింది. భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ ఈ మేరకు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచాడని, ఇంగ్లండ్‌లోనూ అతడికి భారీగా అభిమానులున్నారని వాజ్ అన్నారు. మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ‘సచిన్’ ముంబై: సచిన్ టెండూల్కర్ జీవితం ఇకపై స్కూల్ పుస్తకాల్లోనూ కనిపించనుంది. చిన్నారులలో స్ఫూర్తి నింపేందుకు సచిన్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
‘మాస్టర్’ మనసున్న మారాజు
న్యూఢిల్లీ: సచిన్ కేవలం జగం మెచ్చిన క్రికెటరే కాదు... జనం కోసం పాటుపడే వ్యక్తి కూడా అని అతని అత్త అనాబెల్ మెహతా తెలిపారు. సామాజిక సేవల్లోనూ అతనిది ముందుండే వ్యక్తిత్వమని చెప్పారు. ముఖ్యంగా ముంబై మురికివాడల్లోని చిన్నారుల విద్య కోసం తన అల్లుడు పరితపించాడన్నారు. తాను నెలకొల్పిన స్వచ్ఛంద సేవ సంస్థ ‘అప్నాలయా’కు అన్నీ తానై సచిన్ వ్యవహరించాడని ఆమె చెప్పారు. ఆమె 40 ఏళ్లుగా ఈ సంస్థను నడిపిస్తున్నారు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ స్మారకార్థం విద్యార్థులకు చక్కని సదుపాయాలు కల్పించాడని మెహతా చెప్పారు. ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో సచిన్ ఒకడు. ఇందులో సందేహమే లేదు. సమున్నత వ్యక్తిత్వంలోనూ అతనికి అతనే సాటి. తన తండ్రి మార్గదర్శనమో, లేక ప్రభావమో గానీ... టెండూల్కర్ కుటుంబానికి ఎంతో విలువిస్తాడు, అవసరమైతే సమాజానికి అండగా నిలవాలనుకుంటాడు’ అని అంజలి తల్లి మెహతా చెప్పారు. సచిన్ రిటైర్మెంట్ను తమ అప్నాలయా చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.