
సాక్షి, హైదరాబాద్: ఆల్‌స్టార్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బుల్స్ జట్టు సత్తా చాటింది. వైఎంసీఏ గ్రౌండ్‌లో బుధవారం జూనియర్ బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో 66–61 పాయింట్ల తేడాతో హాక్స్‌పై విజయం సాధించింది. బుల్స్ తరఫున విఘ్నేశ్ 33 పాయింట్లు, నితీశ్ 14 పాయింట్లు సాధించగా.. హాక్స్ జట్టు తరఫున రిత్విక్ 16 పాయింట్లు, అభినవ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో లయన్స్‌పై 41–34 తేడాతో వోల్వ్స్ గెలుపొందింది. వోల్వ్స్ తరఫున అమన్ 17, సౌరవ్ 12 పాయింట్లు సాధించగా... లయన్స్ జట్టులో ఆయూష్ 10, మాజిద్ 8 పాయింట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment