క్లబ్ లీగ్ బాస్కెట్ బాల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ), జోసెఫిన్ శాం తినగర్ జట్లు గెలుపొందాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీసీఓబీ జట్టు 73-23తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఈలో ఉన్న సీసీఓబీకి ఇది రెండో విజయం.
సీసీఓబీ తరఫున నాగరాజు (14 పాయింట్లు), మొయిన్ (12 పా.) రాణించగా రిహీంపురా జ ట్టు ఆటగాడు సిద్ధార్థ్(14 పా.)ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో జోసెఫిన్ శాంతినగర్ జట్టు 52-14తో ఈసీఐఎల్ జట్టును చిత్తుగా ఓడిం చింది. శాంతినగర్ జట్టులో అరుణ్ 10 పాయిం ట్లు, అనుకేశ్ 8 పాయింట్లు సాధించారు.
సీసీఓబీకి రెండో విజయం
Published Sat, Jul 23 2016 12:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement
Advertisement